నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనగానే డాక్టర్ సలహా మందుల వాడకం తప్పనిసరి అయిపోతూ ఉంటె కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఒక చిన్న చెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకుని తగ్గించటం మంచిది. అలాగే పచ్చి  బొప్పాయి ముక్కలు లేదా కూర తిన్నా హలితం ఉంటుంది. నెలసరి వచ్చే ముందర అల్లం టీ తాగటం మొదలు పెట్టాలి. అల్లం దంచి నీటిలో మరిగించి తేనె  కలిపి తాగాలి. వారం రోజులపాటు దానిమ్మ రసం గ్లాసుడు చొప్పున తాగాలి. ఇలా పదిహేను రోజుల పటు చేస్తే కడుపు నొప్పి రాకపోవచ్చు. లేదా ఈ దానిమ్మ రసం వల్ల  పొట్టలో మెలితిప్పినట్లుగా ఉండటం వికారం వంటి సమస్యలు లేకుండా పోతాయి. వట్టి రసం బాగుండదనిపిస్తే అందులో చెరుకు రసం కలిపి తాగచ్చు . ఈ రెంటి కారణంగా కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలగవచ్చు.

Leave a comment