సెక్రటరీతో సహా అనేక నవలలు రాసి రచయితలు నడిచే దారిని మరింత సుగమం చేశారు.అభిమన ధనం ఉన్న హీరోయిన్లను అందగాళ్ళయిన రాజశేఖరాలను సృష్టించి అమ్మాయిల కలలకు ఆసరా ఇచ్చారు.రచయిత్రుల యుగాన్ని ముందుండి నడిపించారు.ఆమె రాసిన నవలల్లో ఒకటీ ఆరాధన. రెండో పెళ్ళివాడైన అనంత్ ను చేసుకున్న మూగపిల్ల అన్నపూర్ణ కథ ఇది.మొదటి భార్య కోరుకున్న ఐశ్వర్యాలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేకపోయాననే ఆవేదనతో తన చుట్టు రతి గోడను కట్టుకుంటాడు అనంత్.అన్నపూర్ణని భార్యగా గుర్తించేందుకు మనసు అంగీకరించదు.కానీ ఆమె ఇంట్లో నుంచ వెళ్లిపోయాకా గానీ విలువ అర్ధంకాదు.అనంత్ కి తాను రుణపడి ఉన్నానన్న భావనతోనే ఇంటికి తిరిగి వస్తుంది.ఆమె మనసుని అనంత్ గెలుచుకోవడం ఆరాధన కథ.సులోచనరాణి గారి పుస్తకాలు ఇప్పటికే రీ ప్రింట్స్ అవుతూనే ఉంటాయి.ఆమె పాఠకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు.
వివరాలకోసం సంప్రదించవలసిన ఫోన్ నం: 0866-2436643