చిన్న పిల్లలకు ఏ డ్రెస్ అయినా అందంగానే ఉంటుంది. మగ పిల్లలకు గౌన్లు కుట్టించి ఆడపిల్లలకు ప్యాంట్లు షర్టు వేసి సంతోషపడుతుంటారు. తల్లులు . ఇది పాత కాలపు ముచ్చట అనుకుంటే తల్లి తండ్రి పిల్లా పిల్లాడు సేమ్ డ్రెస్ వేసుకోవటం లేకపోతే పుట్టిన రోజు పాపాయికి పెద్దవాళ్ళు వేసుకునే అన్నిరకాల డిజైనర్ డ్రెస్ లు రావటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బేబీ గ్రాండ్ మా కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి. బొమ్మల విగ్గు కళ్లద్దాలు నడవలేని బుల్లి బామ్మకు వాకరు మొత్తం మామ్మ సెట్ అంతా పాపాయికోసం తయారవుతోంది. రెండు మూడేళ్ళ పిల్లలను ఇప్పడూ కేర్ సెంటర్స్ కు పంపుతుంటారు. కనుక ఏ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ లో పెడితే పాపాయి కళ్ళజోడు విగ్గుతో నడుస్తూ బోసినవ్వు నవ్వితే ఆ సరదానే వేరు కదా. కుందేలు పులి సింహం లాంటి డ్రెస్ లు ఇప్పటికే  పాత బడ్డాయి కూడా . మరిప్పుడే ఈ బొమ్మ డ్రెస్ కోసం ఆన్ లైన్ మార్కెట్ వెతకండి.

Leave a comment