Categories
ప్రపంచం మొత్తం మీటూ ఉద్యమ తాకిడితో కంపిస్తోంది.బాధితుల గొంతు బటంగా బయటకు వినిపిస్తోంది.దీనికి విరుద్దంగా హ్యూమన్ రైట్స్ వాచ్ తాజా అధ్యయనంలో ఉత్తర కొరియాలో మహిళలపై అత్యచారం జరగటం అన్నది అత్యంత సాధారణ విషయమని దానికి గానూ ఎలాంటి శిక్షలు ఉండవని అదసలు నేరం కాదని తేలింది. ఎన్నో కారణాలతో దేశం విడిచి పెట్టి వెళ్ళిన వందల మంది ఉత్తర కొరియన్లను ఇంటార్వ్యూ చేసిన అనంతరం వారు చెప్పిన అత్యాచార లైంగిక వేధింపుల రహస్య సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ దేశంలో మహిళల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కొన్ని నిజ సంఘటనలను ఉదహారణలుగా రిపోర్ట్ పెట్టింది.