ఎంతో డిప్రషన్ కు గురయ్యాను . మళ్ళి నా జీవితం నా చేతుల్లోకి వచ్చేందుకు నేనెంతో కష్టపడ్డాను అంటోంది పరిణీత చోప్రా . ఎవరికైనా ఒక కష్టం రావచ్చు . కానీ మనం దానినుంచి బయట పడే దారి చుసుకోవాలి . నేను నటించిన శుద్ద్ దేశీ రొమాన్స్,హషితో సంఘీ సినిమాలు సరిగ్గ ఆడలేదు . అదే సమయంలో కొన్ని పెట్టుబడులు పెట్టవలసి రావటం ,కొత్త ఇల్లు కొనుక్కోవటం వంటివి జరిగాయి . ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి ఓ రిలేషన్ కారణంగా హార్ట్ బ్రేక్ వంటివన్నీ చుట్టేశాయి. డిప్రషన్ ,ఏమి తినలేకపోయే దాన్ని,నిద్ర పట్టేది కాదు . ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు . గది లో ఒక్కదాన్ని టి.వి ముందు కూర్చునే దాన్ని . రోజులో పదిసార్లన్న ఏడ్చేదాన్ని . తర్వాత నాకై నేను సర్దుకొన్నా ఈ సమస్యలకు నేను ఎంత వరకు కారణమో తెచ్చుకొంటున్నా కొద్దీ నెమ్మదిగా నా జీవితం నా చేతుల్లోకి వచ్చింది అని చెప్పింది పరిణితి చోప్రా .