Categories
ఆర్మీ ఆఫీసర్ అవినాష్ భార్య షాలిని సింగ్ 20 ఏళ్లకే మగబిడ్డకు జన్మనిచ్చారు షాలిని. అవినాష్ కాశ్మీర్ లోని యుద్ధ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపెట్టే ఎన్ కౌంటర్ లో విజయం సాధించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. భర్త అవినాష్ మరణించాక షాలిని ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకొని చెన్నయ్ లోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరింది. ఆర్మీ ఆఫీసర్ గా సేవలు ప్రారంభించింది. 2002లో కలాం చేతుల మీదుగా వారి కీర్తి చక్ర అవార్డు ను అందుకున్న షాలిని సింగ్ 2008 వరకు మిలటరీ సేవలు అందించిన తర్వాత ఎంబి.ఏ పూర్తి చేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో లీడర్ గా పనిచేస్తోంది. ఎటువంటి రాయితీ లేకుండా నేను ఇదంతా సాధించాను అంటారు షాలిని సింగ్.