రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరాలకు లెక్కలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ క్యాన్సర్ బారిన పడి సంవత్సరాల తరబడి పడ్డ కష్టాలు చెపుతూనే ఉన్నారు. ఎంజెలినా జోలీ ,సెరెనా గోమెజ్ వంటి సెలబ్రిటీలు ఆపద నుంచి గట్టెక్కి మన కళ్ళ ముందే ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ ను వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రారంభ దశలోనే నిలిపి వేసేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. రొమ్ము క్యాన్సర్ గుర్తించగానే ఆహార పదార్ధాలలో పాల ఉత్పత్తులు, పశు మాంసం , గుడ్లు, చేపలు, బంగాళా దుంపలు ,చిక్కుడు మొదలైనవి పరిమితం చేయాలి. ఇతర ఆకుకూరలు, కాయగూరలు పండ్లు తినటం మొదలు పెట్టాలి.  క్యాన్సర్ పెరుగుదలకు దోహదం చేసే పదార్థాలను తగ్గించగలిగితే క్యాన్సర్ విస్తరించకుండా ఉంటుంది.

Leave a comment