రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యానికి ఎప్పటినుంచో చీరలపై డిజైన్లు గా చేస్తున్నారు కళాకారులు. కేరళ నుంచి ఈ హ్యాండ్ ప్రింటెడ్ రాధాకృష్ణ చీరలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలాగే కలంకారి డిజైన్ లలో రాధాకృష్ణుని బాల్యం, నెమళ్ళు, గుళ్లు, గోపురాలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ల కిందే లెక్క. పల్లూ డిజైన్ లేక కాకుండా లెహంగాలు, దుపట్టాలు అనార్కలి ల్లో కూడా ఉదయ్ పూర్ కళాకారులు శ్రీకృష్ణుని చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ డిజైన్లలో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గొట్ట పట్టీలు ట్రెండ్ గా నిలిచాయి. బెనారస్ చీరలు పైన కూడా ఈ శ్యామ సుందరుడి దివ్య రూపం అందంగా కనిపిస్తుంది. ఆధునిక డిజైనర్లు కూడా అధ్యాత్మికం, కళాత్మకం అయిన ఆ శ్రీకృష్ణుని రూపాలను తమ కొత్త ఆవిష్కరణలుగా తెస్తున్నారు.

Leave a comment