ఇప్పుడన్నీ శుభకార్యాలు, పండగల రోజులే పగలంతా ఆఫీస్ పని వున్న రాత్రి వేళ వేడుకలకు అటెండ్ అవుతూ వుండాలి. ఆ అలసట ఉదయాన్నే మొహం పైన కనబడుతూ వుంటుంది. అలాంటప్పుడు అలసట ఉన్న మొహం పై చందనం రోజ్ వాటర్ కలసిన పూత వేస్తే చర్మం తాజాగా అయిపోతుంది. అలాగే బద్దకాన్ని వదిలించుకునేందుకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. నిద్ర చాలక కంటి కింద ఉబ్బినట్టుగా కనబడే ప్రమాదం వుంది. దాన్ని కళ్ళపై ఇరవై నిమిషాల పాటు ఉంచితే కళ్ళు  ఫ్రెష్ గా వుంటాయి. తేలిక పాటి అల్పాహారం, లేదా పండ్లు తీసుకుంటే శరీరం తేలికగా వుంటుంది.

Leave a comment