Categories
వీణ వాయిస్తూ కనిపించే సరస్వతీ దేవి రూపంలో కనిపించే అంతరార్ధం గురించి చెప్పారు. ఒక పండితుడు ఆమె నివసించే సరోవరం జ్ఞాన గంట. ఎప్పటికీ చెదరనిదీ నిరంతరం వుండేది. ఆ సరస్సులో తిరుగాడుతూ వుండే హంస మంచి చెడుల వివక్ష ని తేల్చి చెప్పగల బుద్దికి సంకేతం. సరస్వతీ దేవి చేతులో వుండే చిలుక, గురువు చెప్పే పాఠాన్ని ఉన్నదన్నట్లుగా రెండు మార్లు పలకాలని సంకేతం. ఆమె చేతిలో అక్షర మూల గురువు చెప్పిన దాన్ని మననం చేయాలని, నిరంతరం చదువుతూ ఉండాలని చెప్పుతుంది. ఆమె చేతిలో వీణ సంగీతాన్ని వింటే మనసు తరంగితమౌతూ ఆనందాన్నిస్తుందని చెప్పేందుకు సరస్వతీ రూపం అలా సాక్షాత్కరిస్తుందిట.. తెల్లని వస్త్ర ధారణ మచ్చ లేని వ్యాక్యాత్వానికీ, ఆమె కూర్చున్న పద్మం అందరి బుద్దుల్ని వికసింప జేస్తుందని అర్ధం.