Categories
ఇక నడిచే రోజులన్నీ చల్లగా ఉండేవే . ఈ సమయంలో ప్రకృతి సహజంగా దొరికే నూనెలలో శరీరానికి మసాజ్ చేసుకొంటే మంచిదంటున్నారు . ఆరోమా ఆయిల్స్ లో టీ ట్రీ ఆయిల్ శక్తివంతమైన యాంటీ సెప్టిక్ ఆయిల్ . దీని ఆవిరి కూడా క్రిముల్ని నశించేలా చేస్తుంది . చలి రోజులకు చక్కగా సూటవుతుంది . చర్మానికి క్లినింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . పాదాల దుర్వాసనకు,చుండ్రుకు కూడా మంచి మందు . మసాజ్ కోసం తీసుకొనే నూనెలో మూడు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు . స్నానం చేసే నీళ్ళలో ఒక్క చుక్క వేయచ్చు . తెగిన గాయాలు,మొటిమలు ,దెబ్బల పైన ఒక చుక్క వేసినా చాలు . నయమై పోతాయి . మూడ్స్ ను మార్చగల సామర్థ్యం ఉన్న ఆయిల్ ఇది .