ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు చెప్పేదిట. పిల్లలు బొమ్మలు చూసి అమ్మా కదల మాయాజాలం లో పడి ప్లెటు ఖాలీ చేసేవారంట. ఇవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్  లో పెడితే లక్ష మంది మెచ్చుకున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ కోసం fruit carving, vegetable carving స్టాక్ ఫొటోస్ చూసి ఆ కోర్సు నేర్చుకుని పిల్లల్ని మంచి ఫుడ్ తినేలా చేయొచ్చు. ఇంత అందమైన ఫుడ్ ఇంట్లో చూసి పిల్లలు పిజ్జాలు అడిగితె ఆప్పుడు చెప్పండి.

Leave a comment