నీహారికా,
నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో వాడుకోగాలిగేవే లేదా వంట తేలికగా చేసుకో గలిగేవే. కానీ నాకోసం ఇంకేం ఉండవా అని విచార పాడింది ఓ అమ్మ. నిజమే చాలా మంది ఊరినుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంట్లో అందరికి ఎన్నో వస్తువులు తెస్తారు. అమ్మకి వంట గిన్నెలు తెప్పించి ఇంకేం వుండవా? ఆమెకు ఉపయోగ పడే ఫిట్నెస్ ట్రిక్స్, స్పోర్ట్ షూలు ఇవ్వచ్చు. గ్రీన్ టీ పాకేట్ లు తేవొచ్చు. అరోమా ధెరఫి కాండిల్స్ ఇవ్వొచ్చు, ఆమె మనస్సు శారిఇరం ప్రశాంతంగా ఉండేలా చేసే వస్తువులు ఎన్ని లేవూ? ఇప్పుడు ఫిట్ బిట్ ఉందనుకో. ఇది ఆమె తీసుకునే డైట్ చెక్ చేస్తుంది. వర్కవుట్స్ మోనిటర్ చేస్తుంది. దీన్ని స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేస్తే హెల్త్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అమ్మకు గార్డెనింగ్ ఇష్టమైతే గార్డెనింగ్ కిట్ ఇవ్వోచ్చు. ఇంటిలో మొత్తం సభ్యుల ఆరోగ్యం కోసం ఆహోరహం శ్రమించే మనిషికి ఇచ్చేందుకు ఒక్క మంచి వస్తువు దొరకదా? ఎందుకో మరి అందరికి అమ్మ అనగానే వంటిల్లే గుర్తొస్తుంది. కాస్త విభిన్నంగా ఆలోచిస్తే బావుండదా అని.