చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు పెడతాయి. తక్షణ ఉపసమనం కోసం ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని వుంచి మంట పెడుతున్న భాగంలో అద్దాలి. ఓ పది నిముషాలుఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా వుంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖం పై రుద్దుకుంటే అలసట పోతుంది. ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందర కనుబొమ్మలు ఐస్ ముక్కతో రుద్దితే నొప్పి అనిపించదు, చర్మం కందిపోదు. కొందరికి కళ్ళ కింద నిద్ర ఎక్కువ అయిపోయినా కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపు తో చెక్కగా వుంటుంది. ఐస్ ముక్కాలా తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా వుంటుంది.

Leave a comment