Portulaca oleracea అంటే చెప్పలేరేమో గానీ గంగ పాయిల కూర అనండి తెలంగాణాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వారంలో రెండు రోజులైనా ఈ కూర వండుకోంటారక్కడ. వేసవిలో ఆకు కూరలు పెంచడం కష్టం. కానీ మండుటెండల్ని తట్టుకుని చుక్కనీరు లేకున్నా పెరిగే మహా గట్టి మొక్కగంగపాయి కూర. గడ్డి మొక్కలా కనిపిస్తుంది కానీ వేళ్ళ లోపలకంటుకెళ్ళి నీటిని పోషకాలను పిల్చుకుంటాయి. చిన్న పూలతో మందపాటి ఆకులతో వుండే ఈ గడ్డి మొక్క సలాడ్లు, ఆమ్లెట్లలో బావుంటుంది. స్వల్పంగా క్యాలరీలు, విటమిన్లు, ఖనిజాలు అధిక శతంలో దొరుకుతాయి. చెడు నూనెలు, ఇతర ఫ్యాటీ ఆమ్లాల కన్నా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ కూరలో అధికం విటమిన్- సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, ఐరన్, మాంగానీస్, పోటాషియం, కాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. బరువు తగ్గించే ఆహారం చర్మానికి కూడా ఇది మంచి పోషకాహారం. చిన్ని పూలతో వుండే ఈ కురాను ఇంటి ముందు అందం కోసం కూడా పెంచుకోవచ్చు.
Categories