చీరె ఎప్పుడు అద్భుతమైన అందమే. కానీ చీరె రంగు వేసుకొనే ఆభరణాల ఎంపిక లో ఒక ప్రత్యేకత వుంటేనే చీరె అందం వైయ్యింతలుగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సమంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఎంతో ట్రెండ్. మిరుమిట్లు గొలిపే బంగారు రంగు చీరె అందమైన ముత్యాలు జ్యువెలరీ లో సమంత అచ్చంగా దేవత లాగా కనిపిస్తుంది. ప్రీతం జుల్కర్ డిజైన్ చేసిన గుడ్ ఎక్స్ డిజైనర్ చీరె కట్టుకొంది సామ్ ఈ చక్కని చీరె పైన బంగారు రంగు వర్క్ చేశారు. రిచ్ పెర్ల్ నెక్లెస్ సున్నితమైన చెవి రంగులతో. తలపైన  ఎత్తుగా బన్ తో ఆమె రూపం అద్భుతంగా ఉంది. అభిమానులు,చిత్ర పరిశ్రమకు చెందిన వారు కూడా ఆమెపై ప్రశంశల వర్షం కురిపించారు హన్సిక,తమన్నా ఆమె అందమైన రూపాన్ని పొగిడేశారు.

Leave a comment