చదువు గురించో ఉద్యోగం కోసమో అమ్మాయిలు ఇంటికి దూరంగా ఉంటారు. ఒక చిన్ని అలవాటు తో చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి చిన్న విషయం రాసుకునే ఒక డైరీ మెయిన్ టెయిన్ చేయటం. ఒక చిన్న బుక్ బ్యాగ్ లో ఉంటే ఇంటికి కావలిసిన వస్తువులే కాదు. చెల్లించాల్సిన బిల్లులు చేయాల్సిన పనులు అలాగే ముఖ్యమైన డేట్లు నోట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అమ్మ అన్నీ అమర్చిపెట్టినట్లే బయట కూడా మేనేజ్ చేయచ్చు. కొన్ని నిముషాల్లో చేసుకునే ఆహార పదార్ధాలు ఉంటాయి. అవి ఎలా చేయాలో రాసి పెట్టుకుంటే కనీసం తేలిగ్గా చేయగలిగే ఉప్మా కి కావలిసిన వస్తువులు రాసిపెట్టుకున్న ఆచరిస్తే సమస్య ఉండదు. అలాగే బ్రేడ్ డ్రై ఫ్రూట్స్. తెచ్చిపెట్టుకుంటే చదువుకుంటూ లేట్ గా ఆకలేస్తే తినేందుకు ఏమీ లేవే అన్న బాధుండదు. అలాగే చిన్న చిన్న అవసరాలకు సరిపడే చిల్లర ఒక బాక్స్ లో వేసి పెట్టుకోవాలి . పెద్ద నోటుకు గబుక్కున చిల్లర దొరక్కపోవచ్చు. అలాగే కొనుగోళ్లు విషయంలో ఒక హద్దు నిర్ణయించుకోవాలి. గబుక్కున చేతిలో ఉన్నవన్నీ నచ్చిన వస్తువు కోసం ఖర్చు చేస్తే ఎంత సమస్య. అందుకే అన్నీ శ్రద్ధగా మెయిన్ టెయిన్ చేయటం నేర్చుకోవాలి.
Categories