నీహారికా,

అప్పులేని వాడు అధిక అధిక సంపన్నుడు అనే మాట ఎప్పుడైనా విన్నావా? పెద్ద వాళ్ళు అనుభవంతో మాటల్లో చెప్పే మాట చాలా కరక్ట్ చాలా మందికి అప్పు చేయడం ఫ్యాషన్. పరపతికి ఒక గుర్తు. ఎంత వడ్డీ తో అయినా అప్పుచేసేసి వీలయితే తీర్చడం లేడుండా చేతులు ఎత్తేయడం చాలా మంది అలవాటు కుడా. నిజానికి అవసరం అయితే అప్పు తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ అప్పు అలవాటుగా మారితే మాత్రమే తప్పు. ఇప్పుడు ఈ కాలంలో పక్కవాళ్ళ క్రెడిట్ కార్డు పైన కుడా షాపింగ్ చేయడం, తర్వాత నువ్వయినా ఆ అప్పే కదా చేసేది అని నిస్థురాలు పలకడం కుడా ఉంటున్నాం. ఇవన్నీ హుందాతనాన్ని దెబ్బ తీసెవే కేవలం సరదాల కోసం, జల్సాలకోసం, గొప్పకోసం అప్పులు చేయడం మాత్రం కరక్ట్ కాదు. ఉన్నాంతలో పొడువుగా వుంటూ వున్న దానిని జాగ్రత్తగా వాడుకుంటూ  అప్పు లేకుండా జీవించడమే సభ్యత సంస్కారం వున్న వాళ్ళు మెలగవలసిన పద్దతి. అప్పు దొరికే పరపతి ఉండొచ్చు కానీ చేయకుండా వుండటం  హుందాతనం.

Leave a comment