పాదాల పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోతే దుమ్ముధూళి సోకే వీలున్న పాదాలు కనుక పగుళ్ళు వచ్చేస్తాయి. రకరకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. కనుక పాదాలకు సౌందర్య చికిత్సలు కావాలి అంటారు ఎక్సపర్ట్స్. పాదాల మురికి వదలాలి అంటే వారానికి ఒకసారి ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకోవాలి బాగా ఆరాక కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గులాబీ రేకులు, రోజ్ వాటర్, పాలు, తేనె కలిపి మెత్తగా గుజ్జులాగా చేరుకొని పాదాలకు పట్టించాలి ఆరిపోయాక కడిగేసుకోవాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment