బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరక్టర్ కిరణ్ మజూందర్ షా కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మొదటిసారిగా ఫిమెల్ ఫారిన్ ఫెలోగా ఎంపిక చేసింది. అత్యంత ప్రతిభావంతు రాలైన 24మంది సభ్యులుగా ఉన్న బృందంలో కూడా ఆమెకు చోటు లభించింది.సాంకేతికత ఇంజనీరింగ్ సైన్స్ లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకుగాను ప్రపంచ సాంకేతికత ఆర్ధిక పురోభివృద్దిలో ఆస్ట్రేలియా ముందుండాలన్న ఉద్దేశ్యంతో ఈ అకాడమీ ఏర్పటు చేశారు. భారతదేశం నుంచి కిరన్ మజూందర్ ఎంపికైన ఈ బృందంలో ఇంకో పది మంది మహిళలున్నారు.