కలకత్తాకి చెందిన యూరోపా భౌమిక్ చక్కని బాడీ బిల్డర్.ఆడ పిల్లలు బాడీ బిల్డర్ కావడం అంటే కండలు పెరిగి సున్నితత్వం పోయి అబ్బాయిలాగా అయిపోవడమే అయినా ఈ సందేహాలు పక్కన బెట్టి ప్రతి రంగలోకి వస్తున్నారు అమ్మాయిలు. యూరోపా భౌమిక్ చిన్న తనాన వీపరీతమైన బరువు పెరిగింది. ఆ శరీరం తగ్గించుకోవడం కోసం బాడీ బిల్డింగ్ వైపు వచ్చింది.ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ అమ్మాయిని ట్రాన్స్ జెండర్ అంటూ వెక్కిరించేవాళ్ళు ఈ పోలికను సానుకూలంగా తీసుకుని ఎన్నో పోటీల్లో పాల్గొని 19 సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కురాలైన బాడీ బిల్డర్ గా పేరు సంపాదించింది.

Leave a comment