Categories
ఆరోగ్యవంతమైన అందాల ప్రయోజనాలు కలిగిన పండగ చెప్పే, అవకాడో లో లెక్కలేనన్ని పోషకాలున్నాయి. అవకాడో కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా పండ్ల కంటే నిండు రంగులు వుంటే అవి బాగా పండాయని అర్ధం మచ్చులుంటే పాడయిపోయాయని తెలుసుకోవాలి. పండిన వాటిని కట్ చేసి ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు భద్రం చేసుకోవచ్చు. ఒక వేళ కట్ చేసాక పండ లేదని తెలిస్తే పండు కందనైనా ఆరెంజ్, నిమ్మలేదా నారింజ రసం చిమ్మేసి రెండు చేక్కలి కలిపి ప్లాస్టిక్ బ్యాగ్ లో వుంచి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల పండు రంగు ముదురు. వెలుపల చర్మం, మధ్యలో గింజల్ని తీసేసి యధాతదంగా తినచ్చు సలాడ్ లో జత చేయచ్చు టమాటాల మాదిరిగా ఇవి రుచి ఇస్తాయి. అవకాడో పండును చిదిమి కలిపి తీసుకుంటే కడుపులో చల్లగా వుంటుంది.