శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ స్నానం బావుందంటారు. కానీ వేడి నీళ్ళతో చర్మం, జుట్టు పై వుండే సహజమైన తేమ మాయమైపోతుంది. తేమ తగ్గి చర్మం వెంట్రుకలు పోడిబారిపోతాయి. అంచేత గోరు వెచ్చని నీళ్ళలో గుప్పెడు గులాబీ రేకులు, రెండు చుక్కల లవెందర్ నూనె కలపాలి. అంతకంటే ముందు ఒక కప్పు గులాబీ రేకుల్ని తీసుకుని మెత్తని గుజ్జులా చేసి అందులో కొంచం పంచదర, కొబ్బరి నూనె తీసుకుని మెత్తని గుజ్జుగా చేసి ఒంటికి నెమ్మదిగా మర్దనా చేసుకుని పరిమళ ద్రవ్యాలు కలిపిన నీటి తో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపించడమే కాదు శరీరానికి రక్త ప్రసరణ కూడా అందుతుంది. ఆలివ్ నూనె వేడి చేసి దానికి ఓ స్పూన్ తేనె కలిపి ఒంటికి పట్టించాలి. కనీసం పది నిముషాలు మర్దనా చేయాలి. తర్వాత వెచ్చని నీళ్ళలో గులబీ రేకులు పాలు కలిపి స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
Categories