సాధారణంగా బయటికి పోయే ముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేస్తారు చాలా మంది. సూర్య కిరణాల భారి నుంచి చర్మాన్ని కాపాడుకొనే పద్దతుల్లో ఇంకొకటి. అయితే శారీరం సహజంగా ఉత్పత్తి చేసే విటమిన్ డి ని ఈ సన్ స్క్రీన్ అడ్డుకుంటుందని పరిశోధకులు చెప్పుతున్నారు. రంగు తక్కువగా వున్న వారి శరీరం విటమిన్-డి ఉత్పత్తిని తక్కువగా వున్న వారి శరీరం విటమిన్ డి ఉత్పత్తిని తక్కువగా చేసుకోగలుగుతుందని, ఈ లోషన్ల వాడకం వల్ల విటమిన్ డి ఉత్పత్తి ఆగిపోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారం నుంచి కాకుండా సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి శరీరానికి అందుతుంది. దీన్ని అడ్డుకునే సన్ స్క్రీన్ లోషన్స్ ని అప్లయ్ చేయొద్దని ఎండ నుంచి కాపాడుకునేందుకుసహజమైన పద్దతులను పాటించమని వీరు సూచిస్తున్నారు.
Categories