Categories
మైసూర్ కు చెందిన కిక్ బాక్సర్ పూజా హర్ష జాతీయ కోచ్ గా ఎంపిక అయ్యారు. భారత దేశం నుంచి జాతీయ స్ధాయి కోచ్ అవ్వుతున్న తోలి మహిళ పూజా హర్ష అలాగే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ భరత్ కింద కే- స్టయిల్ లో బ్లాక్ చెల్డ్ సెకెండ్ డిగ్రీ అందుకో బోతుంది. చిన్నతనం లోనే నన్ను కిక్ బాక్సింగ్ ఆకర్షించింది. ఇది పురుషులకు సంబందించిన క్రీడ అనుకుంటారు. ఇందులో భాగస్వాములు కాలేరు. ఒక వేళ పాల్గొన్నా నిష్ణాతులు కాలేదంతారు. నేనేఒదుకు ఈ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోకూడదు అనుకుని ఈ రంగంలోకి వచ్చాను అంటుంది పూజా. ఈమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. బాలికలను బాక్సింగ్ రంగంలోకి తీసుకు రావడం నాలక్ష్యం అంటారు పూజా హర్ష.