Categories
దీపావళి అంటే వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హిందువులు ఆనందోత్సవాలతో జరుపుకొనే ఈ పండుగను సిక్కులు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1619లో ఆరవ గురువైన హర గోవింద్ సింగ్ ను దీపావళి నాడు విడుదల చేసిన సందర్భంగా సిక్కులు భక్తి భావంతో ఈ పండుగను బండి చోర్ దివాస్ పేరుతో జరుపుకుంటారు. ఆరోజు నీళ్ల మధ్యన స్వర్ణ కాంతులలో వెలిగే గురుద్వారా ని దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు బాణాసంచా కాలుస్తారు.ఆరోజు స్వర్ణదేవాలయం వెలుగు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు అంటారు సందర్శకులు.