సాహసోపేతమైన పాత్రలకు చిరునామాగా, వెండితెర క్వీన్ గా మెరుపులు మెరిపిస్తుంది కంగనా రనౌత్. జాతీయ అవారెడ్ గెలుచుకుంది. మణికర్ణిక, పంగా చిత్రాల్లోని నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కంగనా. ఫ్యాషన్ చిత్రంలో ఆమె ప్రతిభకు తొలిసారి జాతీయ అవార్డు గెలుచుకుంది కంగనా. పంగా లో మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూ తన కలలను సాకారం చేసుకొనే కబడ్డీ క్రీడాకారిణిగా ఆమె కనిపించిన తీరు నటనలో చూపించిన పరిణితి ప్రేక్షకుల మెప్పు పొందింది. మణికర్ణిక లో ఝాన్సీ లక్ష్మీబాయి గా ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది రెండు సినిమాలకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకుంది కంగనా రనౌత్.
|
|