Categories
ఒక కిలో పొడి కొనుక్కోవాలంటే లక్ష రూపాయిలు అవుతుంది . లేదా కప్పు కాఫీ కావాలంటే 850 రూపాయిలు ఇవ్వాలి . పర్యటక ప్రాతం థాయ్ లాండ్ లో ఈ అత్యంత ఖరీదైన బ్లాక్ ప్లేవరి కాఫీ ని తయారు చేస్తారు . ఇది వగరు రుచితో గమ్మత్తుగా ఉంటుంది . ఇంత టేస్ట్ కాఫీ కీ రుచి ఏనుగు పేడతో వస్తుంది . ఏనుగుల చేత కాఫీ గింజలను తినిపిస్తారు . ఇవి ఏనుగుల జీర్ణవ్యవ్యస్థ కుండా ప్రయాణం చేసి బయటకు వస్తాయి అప్పుడు ఆ పేదలోంచి గింజలను ఏరి శుభ్రం చేసి ఎండపెడతారు . కాఫీ ఆర్డర్ ఇవ్వగానే అప్పటికప్పుడు ఫ్రెష్ గా గింజలను కాఫీ మిషన్ లో వేసి తయారుచేస్తారు . ఈ బ్లాక్ ప్లెవర్ కాఫీ రుచి ఖరీదు ని మించి ఉంటుంది అంటారు రుచి చూసిన వాళ్ళు .