Categories
ఏ రూపంలో చూసినా పుస్తకాలు ఇంటికి అందమే కదా.ఆ పుస్తకాల డిజైన్ పూల కుండీల కు వాడేరు కళాకారులు. అచ్చం పుస్తకాల లాగే కనిపిస్తాయి ఎక్కువ నీళ్లు ఎండా అక్కరలేని సెక్యులెంట్ ప్లాంట్స్ నాటుకొని హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. బోన్సాయ్ మైక్రో ల్యాండ్ స్కేప్ వింటేజ్ పాట్ బుక్ ఫ్లవర్ పాట్స్ చూస్తే ఇల్లంతా ఇలాంటి బుక్ పాట్స్ తో నింపేయాలి అనిపించకమానదు. కొన్ని ఫ్లవర్ పాట్స్ సిరామిక్ తో చేసినవి కూడా అచ్చం పుస్తకాల రూపంలో చక్కగా ఉన్నాయి. గది వాతావరణంలో పెరిగే మొక్కలతో ఈ పుస్తకాల కుండీలు అందమైన గృహలంకరణ వస్తువులు.