అందమైన డిజైనర్ డ్రస్ లతో ముద్దొచ్చే బొమ్మలు కేకులు తయారు చేస్తున్నారు బేకింగ్ మాస్టర్స్ .ఏదో కొత్తదనం లేకపోతే బిజినెస్ సాగదు కదా …అందమైన ఈ డిజైనర్ డ్రెస్ ల్లాగా సిల్క్ లెస్, పువ్వులు ఎంబ్రాయిడరీ లు, వాటి పైన మెరిసే రాళ్లు లతలు సర్వం ఫాందంట్ తో సృష్టిస్తున్నారు. పంచదార, నీరు జెలాటిన్ గ్లిజరిన్ కలిపి తయారు చేసిన ఫాందంట్ తో ఎలాంటి డిజైన్ లనైనా ,చాలా సున్నితంగా చెక్క వచ్చు. ఈ ఎడిబుల్ కలర్స్ ఎసెన్స్ కలిపి చేసే ఈ బుట్ట బొమ్మలు ల్లాంటి కేక్ లు చూసేందుకే కాదు, తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. ఈ కేక్ ల పైన పెట్టే బొమ్మల్లో డిస్నీ ప్రిన్సెస్, ప్రోజన్ క్వీన్ ఎల్సా ,సిండ్రెల్లా ,బార్బీ వంటి రకరకాల బొమ్మలు ఉంటాయి. పిల్లల కిష్టమైన ఈ బొమ్మల కేక్ లు ఇవ్వాళ అందరూ ఇష్టపడుతున్నారు .