పనిచేస్తూ తినకండి. వేగంగా తినడం వల్ల సరిగా అరగదు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న ధ్యాసలేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలు చేరతాయి. అందుకే ఎంత తొందర పని వున్నా పదే నిమిషాలు ప్రశాంతంగా తినేందుకు కేటాయించండి అంటున్నాయి అధ్యాయనాలు. తప్పని సరిగా కంప్యుటర్ ఆపేయాలి. అలాగే మనం కాదనుకున్న ఎన్నో పుట్టిన రోజులు, పండగలు, ప్రత్యేక మైన వేడుకలు ఎదో ఒక్కటి వస్తు ఉంటాయి. తప్పని సరిగా హాజరు కావాలి. కేకులు, పేస్ట్రిలు, చాక్లెట్లు సరేసరి. ఇన్నింటితో ఏం తప్పించుకుంటాం అనేసుకొవద్దు. వెళ్ళగానే ప్లేటు నిండగా పండ్లు, కూరగాయల సలాడ్ లు నింపేసి, మరీ ఇష్టమైన పదార్ధం మాత్రం తగుమాత్రం వడ్డించుకుని, ఇక ఆవెళ్ళిన ప్రదేశంలో పది మంది తో కబుర్లు చెప్పుకోవాలి. అలాగే సెలబ్రేషన్ కోసం అందమైన డ్రెస్, నగలు, మంచి చెప్పులు, చక్కని అలంకరణ, హెయిర్ డ్రెస్సింగ్ ఏదీ మనకు వద్దు. అతి తక్కువ ప్రయారిటీ ఇచ్చేది కేవలం ఫుడ్ కే ముఖ్యవిషయం చిన్ని చిన్ని అనారోగ్య సమస్యలకు వేసుకునే టాబ్లెట్లు, డాక్టర్ చెప్పిన జాగ్రత్తలలో రెండు మరవద్దు.
Categories