Categories
రాత్రి వేళ్ళ తగినంత సమయం గాఢనిద్ర పోతేనే శరీరం,మెదడు ఉదయానికి యాక్టివ్ గా ఉంటాయి. గాఢనిద్ర కోసం పాడుకునేందుకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ఆహారం జీర్ణం అయ్యాక పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. పాడుకొనే ముందు స్నానం చేయటం కూడా మంచిది.ఇది శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. చల్లని నీళ్లతో స్నానం చేస్తే శరీరం శుభ్రం కావటమే కాదు ఒత్తిడి,అలసట కూడా దూరం అవుతాయి. బెడ్ రూమ్ కాస్త చల్లగా,సాధారణ ఉష్ణోగ్రత కన్నా కాస్త తక్కువ ఉండేలా చూసుకోవాలి ఫోన్ లు ఇతర గాడ్జెట్ లు చూడకూడదు. ఏదైనా పుస్తకం చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.