కొత్త నీరోచ్చి పాత నీటిని తరిమేసినట్లు కొత్త మార్పు ఎప్పుడు ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తోంది. ఆధునిక టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం సౌకర్యాలను ఇవ్వటం కాకుండా మనుషుల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుతోంది. కాలంతో కలిసి పరిగెత్తటం నేర్చుకున్న వాళ్లనే విజయం వరిస్తోంది. మనల్ని మనం అప్ డేట్ చేసుకుంటూ కాలానుగుణంగా మార్పుల్ని ఆహ్వానించి తీరాలి మన ఆలోచనలు ఆచరణ మారకపోతే మన చుట్టూ ప్రపంచం కూడా మారదు. వ్యాపారాలు, అవకాశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు.బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చాక సమయపాలన సాధ్యమైంది. ఐడి కార్డ్ స్వైప్ చేస్తేనే ఆఫీస్ లోకి అడుగు పెట్టడం సాధ్యం సి.సి కెమెరాలు, రోబోలు, చిప్ లు సెన్సార్లు ఏదో ఒక రూపంలో ఒక పెను మార్పు వస్తూనే ఉంది.ఈ మార్పులను అర్థం చేసుకునే సాంకేతికతను స్వాగతించిన వాళ్లే పురోగతిలో పరుగు తీస్తున్నారు మార్పు సహజం అది ఆమోద యోగ్యమైన ప్రక్రియ దాన్ని ఆహ్వానించను,’నేనంతే’ అంటే వెనక పడినట్లే.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134