Categories
ఐస్ క్యూబ్స్ తో చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐస్ క్యూబ్స్ తో ముఖం పై రుద్దితే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. ఫేస్ పైన ఐసింగ్ చేస్తే చర్మం ఉబ్బటం, స్వెల్లింగ్ లాంటివి ఆగిపోతాయి. ఉదయం పూట ఫేస్ ఐసింగ్ చేయాలి. అలాగే మేకప్ వేసుకునే ముందర కూడా ఐసింగ్ చేయాలి. దీనితో రక్తనాళాలు చల్లదనం వల్ల సంకోచించి చూసేందుకు మంచి లుక్ కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు ఓపెన్ అయి చర్మంపై ముడతలు కనిపించవు. చల్లని నీటితో ముఖం తుడవటం, లేదా ఐస్ క్యూబ్స్ తో మెత్తని గుడ్డ లో కట్టి చర్మం పై మసాజ్ చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.