సహజమైన పదార్ధాలతో అందం ఆరోగ్యం కలకాలం నిలుపుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నిద్రలేకుంటే కళ్ళ చుట్టు ముడతలు వస్తాయి. మార్కెట్ లో చామంతిపూల టీ బ్యాగ్స్ కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లబర్చిన కీరదోసా ముక్కలతో ఫ్రిజ్ లో నుంచి తీసిన టీ బ్యాగ్స్ తో మసాజ్ చేస్తే ముడతలు పోతాయి. అలాగా యోగర్ట్ లోకాస్త పంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖం నెమ్మదిగా మసాజ్ చేస్తే చాలు చర్మం మెరిసిపోతు కనిపిస్తుంది. బ్యాక్ బ్లౌజులు,బ్యాక్ లెస్ డ్రెస్ లు ఫ్యాషన్ గా ఉంటాయి. వీపు భాగం ఎక్కువ కనబడుతుంది. కనబడే వీపు భాగం నునుపుగా మెరుపుతో కనిపించాలంటే అరకప్పు ఆలివ్ నూనె తగినంత ఉప్పు కలిపి అందులో గంధం నూనె కలిపి ఆ మిశ్రమం వీపుకు రాసి పదినిమిషాల తర్వాత తడి టవల్ తో తుడిచేస్తే సరిపోతుంది.

Leave a comment