చర్మ సంరక్షణకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటారు ఎక్సపర్ట్స్. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గించి సహజ సిద్ధమైన మెరుపుని అందించటంలో పెరుగు ఎంతో బాగా పనిచేస్తుంది. పేరుగు లోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగించి కొత్త కణాల పుట్టుక లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగును ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా పైకి కిందికి మర్దన చేయాలి పది నిమిషాలు అలా వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగులో క్యాల్షియం ప్రోటీన్ ,లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. పెరుగులో ఉండే విటమిన్ జింక్ ఫాస్ఫరస్ ఇతర మైక్రో మినరల్స్ చర్మాన్ని అందంగా కాంతివంతంగా చేస్తాయి.

Leave a comment