హాయిగా ఎండలో ఆటలాడితేనే పిల్లల్లో శారీరక పటుత్వం వస్తుంది.తోటి పిల్లలతో ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు బృంద స్ఫూర్తి వస్తుంది. పిల్లలకు క్రీడలపై ఇష్టం పెంచాలంటే సందర్భాలను బట్టి క్రీడా పరికరాలు కానుకగా ఇవ్వాలి. స్కిప్పింగ్ తాడు ,రింగ్ బాల్ ,షటిల్ బ్యాట్ల వంటివి ఇస్తే అందుబాటులో ఉండే వినియోగం పట్ల పిల్లలకు ఆసక్తి కలుగుతోంది. వీటిలో వ్యాయామం ఒక్కటే కాదు ,ఆటల్లో ఎత్తుగడలు ,ఎదుటి వారిని అంచన వేసే శక్తి మెరుగవుతుంది. బృందంగా ఆటలాడితే సమిష్టితత్వం బోధపడుతుంది. సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చేర్చితే నైపుణ్యాలు మెరుగవటంతో పాటు ఆత్మవిశ్వాసం,ఆసక్తి కూడా పెరుగుతాయి.

Leave a comment