Categories
చీరెపిన్నుల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చాయి. చక్కగా మడతపెట్టిన చీరెకొంగు భుజంపైన ఉండేందుకు బ్రూచ్ పెట్టుకోనే వాళ్ళు .ఇప్పుడీ బ్రూచ్ల్లో మేలు జాతి వజ్రాలు ,ముత్యాలు కూర్చిన ,డైమండ్స్ తో నింపినవీ ,రెండు బ్రూచ్ లు కలిపి ఒక గొలుసుతో కలినవి ఎన్నో రకాలు డిజైన్ లు వచ్చాయి. ముత్యాలు వజ్రాలు కలిసిన చిన్న బ్రూచ్ లు చక్కని సాదాపట్టుచీరెకు అద్భుతమైన అందం ఇస్తుంది. రెండు పెండెంట్లు కలిపిన బ్రూచ్ అయితే నడుము దగ్గర చీరెలోకి దూరే హుక్స్ తో కలిపి వడ్డానం కంటే మోడరన్ గా కనిపిస్తుంది. పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ,ఓనీల పంక్షన్లకు ఈ బ్రూచ్ తో చాలా బావుంటాయి.