Categories
వనీతలూ!! సంక్రాంతి పండుగ సంబరాలలో నుంచి మాఘ మాసంలోకి అడుగు పెట్టాం కదా.ఇక పండుగలు, పర్వదినాలు మొదలు.
ఈ రోజు చొల్లంగి అమావాస్య,సముద్ర స్నానం చేసి పునీతులవ్వాలి.ఈ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నాడు ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించి సూర్య నారాయణ స్వామి వారికి పొంగలి ప్రసాదం చేసీ నైవేద్యం సమర్పించిన ఆయురారోగ్యాలతో కలిగివుంటాము.ఈ మాసం దేవతలందరికి ప్రీతి కరమైనది.తులసి దళాలతో విష్ణు మూర్తిని ఆరాధన చేసిన మోక్షం కలుగుతుంది.ఈ మాఘంలో వివాహాలు, గృహ ప్రవేశాలు చేసిన పుణ్యం.భీష్మాచార్యుడు ఈ మాఘమాస ఉత్తరాయణ పుణ్య కాలంలోనే అంపశయ్యపై శయనించాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర,దద్ధోజనం.
-తోలేటి వెంకట శిరీష