Categories
![బయట కన్నా మనం 24 గంటలు శుభ్రం చేసే ఇంట్లో ఎక్కువ కాలుష్యం వుంటుంది అంటున్నారు నిపుణులు. ఎక్కువ సమయం ఇంట్లోనే వుంటాం కనుక మరింత శ్రద్దతో మరచిపోకుండా కొన్నింటిని క్లీన్ చేస్తూనే వుండాలి. ఇప్పుడు టీ.వి రిమొట్ వుంది కదా వస్తూనే రెమొట్ పట్టుకుంటాం. ఇంక ఇంట్లో అందరు చేసేది అదే. మరి ఇన్ని చేతులతో ముట్టుకునే రీమొట్ ని పాపాయి అందుకుని నోట్లో పెట్టుకుంటూ వుంటుంది. క్రమం తప్పకుండా మరి క్లీన్ చేయాలిగా. అలాగే కంప్యుటర్ మౌస్, కీబోర్డ్ కూడా. డోర్ మాట్స్ కూడా వారానికి ఒక సారి వుతికేయాలి. పాత పుస్తకాలు, మాగజైన్స్ అమ్మేయాలి. వారానికోసారి పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ తప్పని సరిగా వుండాలి. రెండేళ్ళ పైగా దిళ్ళు వాడితే తిసేయాల్సిందే. అలాగే ఇల్లు కూడా గుమ్ము ధూళి లేకుండా బాగా దులిపి క్లీన్ చేసి ప్రతి రోజు నేల శుబ్రంగా తుడవాలి. ఇల్లు శుబ్రంగా వుంటే సగం జబ్బులు రావు.](https://vanithavani.com/wp-content/uploads/2017/04/clean.jpg)
ఇల్లు క్లీనింగ్ చాలా కష్టం కనీసం నెలకోసరన్న ఇల్లంతా శుభ్రం చేస్తేనే కానీ ముందు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సీలింగ్ ఫ్యాన్ నిండా దుమ్ముంతుంది డంప్ కవర్ ఫ్యాన్ రెక్కలకు తొడిగి తుడిస్తేనే దుమ్ము మంచాల పైన పడకుండా డంప్ కవర్ లో చేరుతుంది. పరుపులపై మురికి వెక్యూమ్ క్లీనర్తోనే పోతాయి. వూడవర్క్ పైన దుమ్ము పోవాలంటే , లెమున్ ఆయిల్ , వైట్ వెనిగర్ కలిపి తుడిస్తే మెరుస్తాయి. ఇక లైట్ వంటివి డిష్ వాషేర్ తో కడిగి శుభ్రం చేయాలి. ఇక మైక్రోవేవ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ అరకప్పు నీరు మైక్రోవేవ్ లో మరిగిస్తే అలా మరిగిన నీళ్ల ఆవిరి నుంచి అతుక్కుపోయిన ఆహారాన్ని, అవశేషాల్ని లూజ్ అవుతాయి. అప్పుడు దాన్ని శుభ్రం చేయటం ఈజీ.