Categories
ఈ రోజుల్లో నేరేడు పండు ఎక్కువగా దొరుకుతాయి నేరేడు లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటి బారిన పడకుండా తగ్గించే ఔషధగుణాలు నేరేడు పండు లో ఉన్నాయి, విటమిన్ ఎ సి లు కంటి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని శుభ్రపరిచి పనితీరును మెరుగుపరుస్తాయి.దంత సమస్యలు నివారిస్తాయి.మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తాయి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళ వీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.