ప్రభుత్వ దుస్తులు సంస్థ జోడాయిక్,కోవిడ్ 19 తో పాటు ఎన్నో బ్యాక్టీరియా వైరస్ లను చంపగలిగే షర్ట్ లు తయారు చేసింది.వైరో బ్లాక్ అనే బయో కెమికల్ టెక్నాలజీ తో దీన్ని తయారు చేశారు.బట్ట తయారీలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలు వాడారు.ఎవరైనా తుమ్మిన దగ్గినా ఈ దుస్తులపై పడితే వాటిని బలహీనం చేస్తుంది.ఈ చొక్కా లకు 30 వుతుకుల వరకు ఈ శక్తి ఉంటుంది.గతంలో ఉష్ణోగ్రత ను తగ్గించే చల్లని దుస్తులు తయారు చేసిన స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్త్ర పరిశోధన విభాగంలో కలిసి జోడాయిక్ కరోనా నియంత్రిత చొక్కాను మార్కెట్ లోకి తెచ్చింది.

Leave a comment