ఈ చల్లని గాలుల్లో ఖావా చాయ్ తాగితే రుచి, ఆరోగ్యం అంటారు ఇది ఔషధం భరితం కూడా. గిన్నెలో మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగిస్తూ ఐదారు యాలుకలు దంచి వేయాలి దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు రేకులు వేసి మూత పెట్టి మరిగించాలి. సన్నగా తరిగిన బాదాం ముక్కలు రెండు స్పూన్ల తేనె వేసి వేడి వేడిగా తాగాలి.ఇది జలుబు దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఒత్తిడి నియంత్రిస్తుంది కొవ్వును కరిగిస్తుంది.

Leave a comment