Categories
అపార్ట్ మెంట్స్ వచ్చాక సూర్యుడు ,చంద్రుడు కనిపించే అశేలేదు.ఇక ప్రకృతి ,చెట్లు ,వానలు, మెరుపులు చూద్దామన్న అవకాశం లేదు. కళ్ళకి పచ్చగా ఏదైనా కనిపిస్తే బావుండు ఒక చెట్టు ,కొన్ని పువ్వులు ఇలా కిటికీలోంచి కనిపిస్తే ఎంత బావుండు అనుకొంటాం కదా. ఇదిగో త్రీడీ ప్రింటెడ్ కర్టెన్స్ ఆ కోరిక తీర్చేస్తాయి. కళ్ళ ముందు పచ్చదనం చూపిస్తాయి. వాగులు,వంకలు ,పారే సెలయేళ్ళు, బీచ్ అందాలు ,మైమరిపించే పూల కొమ్మలు ఇలా బయటి ప్రపంచంలోని అందాలన్నీ నట్టింట్లోకి తీసుకువచ్చాయి .గోడకు ఒక కిటికీ ,ఆ కిటికీ లోంచి ప్రకృతి అందాలు కనబడుతున్నట్లు, వర్షం ,దూరంగా ఆకాశం ఇవన్ని కళ్ళని కనికట్టు చేసేస్తాయి. ఇంటికే ప్రత్యేకమైన అందం ఇస్తాయి త్రీడీ ప్రింటెడ్ కర్టెన్లు.