ఆశా కందారా (Asha Kandara) ఒకప్పుడు జోద్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ స్వీపర్. భర్త వదిలేసిన ఇద్దరు పిల్లలు తల్లి.జోద్ పూర్ డిప్యూటీ కలెక్టర్ కావటం ఒక అద్భుతమైన ప్రయాణం. భర్త వదిలేశాక ఎప్పుడో ఆగిపోయిన చదువును కొనసాగించి 2016 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా జాయిన్ అయింది. 2018 లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఆర్.ఎ.ఎస్ కు ఎంపికయింది. స్వీపర్ గా పనిచేసిన కార్పొరేషన్ కే అధికారిగా వచ్చింది. స్వీపర్ గానో, కుల పరంగానో ఒంటరి మహిళ గానో నేను అవమానాలు పడినప్పుడు నాకు అండగా నిలవని ఈ సమాజానికి నేను జవాబు ఇవ్వదలచుకొన్నాను. అందుకే నేను చదువునే ఆయుధంగా తీసుకున్నాను అంటారు ఆశా కందారా.

Leave a comment