‘ది ఇండియా ఎథినిక్ కో డాట్’ ప్రస్తుతం కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతోంది. ఈ బిజినెస్ డాట్ కాం సృష్టికర్తలు తల్లీకూతుళ్లు హేతాల్ దేశాయ్,లెఖినీ దేశాయ్ లు. ఒక హ్యాండ్ లూమ్ ఎక్సిబిషన్ లో చేనేత వస్త్రాలు వెరైటీలు చూశాక రకరకాల డిజైన్ దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందీ అని వ్యాపార ఆలోచన కలిగిందట. అలా 50 మీటర్ల ఫ్యాబ్రిక్ తో కుట్టించిన కుర్తీల తో బిజినెస్ మొదలుపెట్టారు ఇద్దరూ ది ఇండియా ఎథినిక్ కో డాట్ వెబ్ సైట్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలుపెట్టారు. లెఖినీ ఎంబీఏ చదువుతూ సోషల్ మీడియాలో మార్కెటింగ్ నిర్వహిస్తే తల్లి హేతాల్ హోటల్ వ్యాపారం నిర్వహించేది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న ప్రముఖ చేనేత వస్త్రాల బ్రాండ్ లలో  ఇండియాన్ ఎథినిక్ కూడా ఒకటి ఈ దేశాయ్ ల డిజైన్స్ చాలా ట్రెండీ అని పేరు వచ్చింది.

Leave a comment