ఈ వజ్రాల ఫేస్ మాస్క్ ధర అక్షరాలా లక్షా నలభై వేల రూపాయలు సూరత్ లో ఉండే వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్ తయారు చేశాడు.  తను చేయించుకున్న మాస్క్ కు ది కుశాల్ బాయ్ అన్న ఇంగ్లీష్ అక్షరాలను వజ్రాలతో  అమర్చుకొని  ఫోటోలు షేర్ చేశాడు. కరోనా సమయంలో ఎలానో మాస్క్ లు తప్పవు పెళ్లి వేడుకల్లో మంచి దుస్తులు ఆభరణాలు ధరించి మామూలు మాస్క్ లు సర్జికల్ మాస్క్ లు ఏం బావుంటాయి.  అప్పుడీ వజ్రాల మాస్కులు ధరిస్తే అందంగా దర్జాగా ఉంటాయి అంటున్నాడు. ఈ వజ్రాల మాస్క్ లు లక్ష నుంచి నాలుగు లక్షల దాకా వజ్రాల ను బట్టి  నిర్ణయించారు కుషాల్.

Leave a comment