అమెరికా అమ్మాయి విరాళి మోది ఇండియాలోనే జన్మించింది అమెరికాలో పెరిగింది ఇప్పుడు ముంబై లో ఉంటున్న విరాళి మోటివేషనల్ స్పీకర్ 2006 లో పదహారేళ్ళ వయసులో ఇండియా వచ్చిన విరాళీ కి మలేరియా వచ్చింది దాన్ని డాక్టర్లు గుర్తించలేదు జ్వరం పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చి కోమాలోకి వెళ్ళి పోయింది విరాళి .వెంటిలేటర్ పైన ఉన్న విరాళి ని ఆమె పుట్టిన రోజు వరకు బతికించమని తల్లి వేడుకొంది చివరకు ఆ రోజున పుట్టినరోజు కేక్ కోస్తున్న సమయంలో విరాళి కళ్ళు తెరిచి కోమాలో నుంచి బయటపడింది కానీ వళ్ళంతా చచ్చుబడి పోయింది. కానీ ఎంతో శ్రమతో చేతులు స్వాధీనంలోకి తెచ్చుకుంది  గొప్ప మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. 2014లో మిస్ వీల్ ఛెయిర్ ఇండియా గా టైటిల్ గెలుచుకుంది. వీల్ చైర్ లో కూర్చుని ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. స్కూబా డైవింగ్‌ చేసింది.

Leave a comment