కేలరీలు ఖర్చై కండరాలు పెరగాలంటే స్క్వాట్స్ కి మించిన వ్యయామం లేనే లేదు. గాల్లో కుర్చున్నట్లు కూర్చుని లేచే వ్యయామం ఇది. ఇవి కాళ్ళను దృఢంగా మారుస్తాయి. కొవ్వు కరిగిస్తాయి,శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. నడుము,పిరుదల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.కాళ్ళు తీరుగా తయారవుతాయి.రోజంతా కూర్చుని పనిచేసే వాళ్ళకి ఇది మంచి వ్యాయామం అంటారు ఫిట్ నెస్ నిపుణులు.ఈ వ్యాయామం చేస్తే నొప్పులు రావు మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.కనీసం యాభై వరకు చేయగలిగితే ప్రయోజనం ఉంటుంది.

Leave a comment