జీవితమే గొప్ప సెలబ్రేషన్ . ఇందులో ప్రతి నిమిషాన్ని పండుగా చేసుకోవచ్చు . మనం ఆనందించే ప్రతి దాన్ని ఇతరులతో కలిసి సెలబ్రెట్ చెసుకుంటాం.  అలాగే ఇప్పుడు ఆడ పిల్లలపైన మనకెంత ముచ్చట ఉందో ఓణీలా పండగా చేసి బంధువులతో పంచుకొంటున్నారు.  ఈ ఫంక్షన్ లో కొంత మంది ఆధునికతనీ , సంప్రదాయాన్ని జోడించమంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. పరికిణా, జూకాలు ,పూల జడ సాధారణ అలంకరణ వేడుకులో పోటాపోటీ హారాలు , వడ్డాణం, జూకాలు పెట్టుకొంటే అమ్మాయిలు చక్కగా కనిపిస్తారు . వేడుక ఉదయం వేళలో అయితే పూర్తి బంగారు నగలు ,రాత్రి వేళ అయితే మెరిసే జాతి రాళ్ళు పొలిన కుందన వజ్రాల నగలైతే కళ్ళు మినుమిట్లు గొతలుపుతూ అందాన్ని రెట్టింపుగా చూపెడతాయి. కాసుల హారం ఈ వేడుకకు మంచి ఎంపిక . ముక్కు పుడకలు ,జడ బిళ్లలు ఇలాంటి మితకాలపు నగలు వేడుకకు మరింత వన్నేతెస్తాయి.

Leave a comment